క్షణం ఆలస్యమైతే...అంతే.. | Railway Protection Force (RPF) personnel saved a passenger life  | Sakshi
Sakshi News home page

క్షణం ఆలస్యమైతే...అంతే..

Nov 14 2018 11:12 AM | Updated on Nov 14 2018 1:07 PM

Railway Protection Force (RPF) personnel saved a passenger life  - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, చెన్నై: ఉరుకుల పరుగుల పయనంలో కన్నుమూసి తెరిచేలోపే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న కాలంలో బతుకుతున్నాం.. కానీ  ఒక్కక్షణం ఆ ప్రమాదం నుంచి బయటపడితే.. పునర్జన్మ లభిస్తే.. నిజంగా జీవితం విలువ ఏమిటో తెలిసి వస్తుంది. చెన్నైలోని ఎగ్‌మోర్‌ రైల్వే స్టేషన్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. క్షణాల్లో  అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఒకరు ప్రయాణికుడిని మృత్యుముఖం నుంచి బయటపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  వైరల్‌  అవుతోంది.

కదులుతున్నరైలును అందుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. అంతే ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి ఒకరు మెరుపువేగంతో కదిలి ఆ ప్రయాణికుడిని రక్షించారు. దీంతో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ఏ మాత్రం ఆలస్యమైనా ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్య పడి ప్రాణాలు పోవడం ఖాయం. జస్ట్‌ వాచ్‌ ది వీడియో..  అండ్‌ బీ ఎలర్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement