రాహుల్‌ పోలీస్‌ సలహాలు పాటించడం లేదు.. | Rahul went abroad without security: Rajnath to Cong protest | Sakshi
Sakshi News home page

రాహుల్‌ పోలీస్‌ సలహాలు పాటించడం లేదు..

Aug 8 2017 12:40 PM | Updated on Sep 11 2017 11:36 PM

రాహుల్‌ ఎస్పీజీ పోలీసుల భద్రత లేకుండా ఇప్పటికి 6 సార్లు దేశం విడిచి వెళ్లారు..

♦ కేం‍ద్రహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
 
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కారు దాడిపై పార్లమెంటులో దుమారం రేగింది. కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లి ఖార్జున్‌ ఖర్గే  దాడిని ఖండిస్తూ ఈ అంశాన్ని సభలో లెవనెత్తారు. బీజేపీ కార్యకర్తలు రాహుల్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ వివరణ ఇచ్చారు.
 
ఈ ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం విచారణ జరుపుతోందని ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాహుల్‌ ఎస్పీజీ పోలీసుల భద్రత లేకుండా ఇప్పటికి 6 సార్లు దేశం విడిచి వెళ్లారని,   పోలీస్‌ సలహాలు పాటించడంలేదని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. గుజరాత్‌ పర్యటనకు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కారులో ఎందుకు వెళ్లలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌  పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  గుజరాత్‌ వరద బాధితులను పరామర్శించేందకు వెళ్లిన రాహుల్‌ గాంధీ కారు పై  రాళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement