లోక్సభలో అసహనంపై మంగళవారం జరిగిన చర్చలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ: లోక్సభలో అసహనంపై మంగళవారం జరిగిన చర్చలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హేతువాదుల హత్యలపైనా, బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా.. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించారని రాహుల్ విమర్శించారు.
'కేంద్ర మంత్రి వీకే సింగ్.. దళితులను కుక్కలతో పోల్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. గాంధీని చంపిన గాడ్సేను బీజేపీ నేత సాక్షి మహరాజ్ ప్రశంసించారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని స్పందించలేదు. దాద్రి ఘటనపైనా మోదీ మాట్లాడలేదు. డబోల్కర్, కల్బుర్గి హత్యలపైనా ఆయన మౌనం వహించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో రోజు రోజుకూ అసహనం పెరిగిపోతోంది. ప్రధాని మోదీని ఎవరైనా విమర్శిస్తే వారిపై దాడులు చేస్తున్నారు. నిరసనలకు దిగితే రాజద్రోహం కేసులు పెడుతున్నారు' అని రాహుల్ అన్నారు.