వారు రిజర్వేషన్లకు వ్యతిరేకం..

Rahul Gandhi Says BJP RSS Against Reservations   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆరెస్సెస్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. దళితుల పురోగతిని వారు కోరుకోరని, బీజేపీ, ఆరెస్సెస్‌లు వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను తొలగించాలనేది ఆరెస్సెస్‌, బీజేపీ డీఎన్‌ఏలో భాగమని, రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లో కొనసాగేలా చూస్తామని తాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దళితులకు హామీ ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

రిజర్వేషన్లను తొలగించడం మోదీజీ, మోహన్‌ భగవత్‌ల స్వప్నాన్ని తాము నెరవేరనీయబోమని వివరించారు. కాగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ చట్టం రాజ్యాంగ భద్రతను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టం కింద ప్రాథమిక ఆధారాలు లభ్యం కాని కేసుల్లోనే కోర్టులు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ప్రాధమిక దర్యాప్తు అవసరం లేదని, సీనియర్‌ పోలీస్‌ అధికారి అనుమతి అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

చదవండి : మోదీ తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top