రాష్ట్రపతికి రక్తంతో లేఖ

Punjab Girls Write Letter With Blood To President Kovind For Justice - Sakshi

మోగ : పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి రక్తంతో లేఖ రాశారు ఇద్దరు పంజాబీ యువతులు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా అత్మహత్య చేసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన నిషా, అమాన్‌ జాట్‌ కౌర్‌ అనే యువతులు ఈ లేఖ రాశారు. తమపై పెట్టిన కేసులు తప్పని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అనంతరం వారు ఓ జాతీయ మీడియాతో మాట్లాడతూ... ‘ డబ్బులు తీసుకొని మోసం చేశామని మాపై కొంత మంది తప్పుడు కేసులు పెట్టారు. అవి తప్పుడు కేసులని, వాటిపై విచారణ చేపట్టాలని పోలీసులను వేడుకున్నా పట్టించుకోలేదు. విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారు. మా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రపతి చొరవ చూపి మాకు న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యలు చేసుకుంటాం’  అని హెచ్చరించారు. 

కాగా యువతుల ఆరోపణలను మోగ జిల్లా డీఎస్పీ కొట్టిపారేశారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, విచారణ చేస్తున్నామని చెప్పారు. విదేశాలను పంపిస్తామని చెబుతూ ఏజెంట్ల రూపంలో ఈ ఇద్దరు యువతులు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదు అందయన్నారు. దానిపైనే విచారణ చేశామన్నారు. రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తనకు తెలియదని, అధికారికంగా తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని డీఎస్పీ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top