పుదుచ్చేరి పీఠం మళ్లీ రంగసామిదే! | Pudhucchery seat again to Rangasamy | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి పీఠం మళ్లీ రంగసామిదే!

Apr 24 2016 3:35 AM | Updated on Mar 29 2019 9:31 PM

పుదుచ్చేరి పీఠం మళ్లీ రంగసామిదే! - Sakshi

పుదుచ్చేరి పీఠం మళ్లీ రంగసామిదే!

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) మళ్లీ విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందు సర్వేలు చెప్తున్నాయి.

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) మళ్లీ విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందు సర్వేలు చెప్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామి 2011లో కాంగ్రెస్‌ను వీడి.. ఏఐఎన్‌ఆర్‌సీని స్థాపించారు. ఆ పార్టీ మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంది.

పుదుచ్చేరిలో బలమైన సామాజిక వర్గం వన్నియార్లకు చెందిన రంగసామి.. రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి అధికారం నిలబెట్టుకుంటారని పరిశీలకులు చెప్తున్నారు. ఏఐఎన్‌ఆర్‌సీతో పొత్తు చర్చలు ఫలించకపోవటంతో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. డీఎంకే - కాంగ్రెస్ ద్వయం కలిసి పోటీ చేస్తున్నాయి. డీఎంకే - కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలున్నాయనీ ఒక సర్వే అంచనా వేస్తోంది. అన్నా డీఎంకే కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్‌ఎస్‌పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్‌డబ్ల్యూ) అధికారపక్షానికి గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌లోని యానాం, కేరళలోని కరైకల్, తమిళనాడులోని మాహె ప్రాంతాలు కూడా పుదుచ్చేరిలో భాగం. యానాంలో మల్లాడి కృష్ణారావు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement