breaking news
Rangasamy
-
పుదుచ్చేరిలో హస్తం హవా!
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) ప్రతిపక్ష హోదాకు పరిమితం కాక తప్పదని సర్వేలు అంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామికి భంగపాటు తప్పదని పేర్కొంటున్నాయి. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్-డీఎంకే 14, ఏఐఎన్ఆర్సీ 9, అన్నాడీఎంకే 2, ఇతరులు 2 సీట్లు దక్కించుకునే అవకాశముందని సీఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్-డీఎంకే 15-21, ఏఐఎన్ఆర్సీ 8-12, అన్నాడీఎంకే 1-4 సీట్లు దక్కించుకోనున్నాయని ఇండియా టుడే సర్వే తెలిపింది. -
పుదుచ్చేరి పీఠం మళ్లీ రంగసామిదే!
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) మళ్లీ విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందు సర్వేలు చెప్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామి 2011లో కాంగ్రెస్ను వీడి.. ఏఐఎన్ఆర్సీని స్థాపించారు. ఆ పార్టీ మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంది. పుదుచ్చేరిలో బలమైన సామాజిక వర్గం వన్నియార్లకు చెందిన రంగసామి.. రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి అధికారం నిలబెట్టుకుంటారని పరిశీలకులు చెప్తున్నారు. ఏఐఎన్ఆర్సీతో పొత్తు చర్చలు ఫలించకపోవటంతో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. డీఎంకే - కాంగ్రెస్ ద్వయం కలిసి పోటీ చేస్తున్నాయి. డీఎంకే - కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలున్నాయనీ ఒక సర్వే అంచనా వేస్తోంది. అన్నా డీఎంకే కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్ఎస్పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్డబ్ల్యూ) అధికారపక్షానికి గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని యానాం, కేరళలోని కరైకల్, తమిళనాడులోని మాహె ప్రాంతాలు కూడా పుదుచ్చేరిలో భాగం. యానాంలో మల్లాడి కృష్ణారావు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.