పుదుచ్చేరిలో హస్తం హవా! | congress to win in puducherry: exit polls | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో హస్తం హవా!

May 16 2016 8:08 PM | Updated on Sep 4 2017 12:14 AM

పుదుచ్చేరిలో హస్తం హవా!

పుదుచ్చేరిలో హస్తం హవా!

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) ప్రతిపక్ష హోదాకు పరిమితం కాక తప్పదని సర్వేలు అంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామికి భంగపాటు తప్పదని పేర్కొంటున్నాయి.

పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్-డీఎంకే 14, ఏఐఎన్‌ఆర్‌సీ 9, అన్నాడీఎంకే 2, ఇతరులు 2 సీట్లు దక్కించుకునే అవకాశముందని సీఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్-డీఎంకే 15-21, ఏఐఎన్‌ఆర్‌సీ 8-12, అన్నాడీఎంకే 1-4 సీట్లు దక్కించుకోనున్నాయని ఇండియా టుడే సర్వే తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement