పబ్‌జీ సరికొత్త వెర్షన్‌; వారి పరిస్థితేంటో..!

PUBG MOBILE Update Set To Bring In New Weapons And Death Replay - Sakshi

ప్రాణాంతక పబ్‌జీ గేమ్‌ను ఇష్టపడే వాళ్లకు దాని సృష్టికర్తలు శుభవార్త చెప్పారు. పబ్‌జీ మొబైల్‌ గేమ్‌ రెండేళ్ల సెలబ్రేషన్స్‌ సందర్భంగా మరో సరికొత్త అప్‌డేట్‌ వెర్షన్‌ తీసుకొస్తున్నట్టు తెలిపారు. తొలుత టైమ్‌పాస్‌ బాటిల్‌ గేమ్‌గా మొదలైన పబ్‌జీ సూపర్‌ సక్సెస్‌ కావడంతో ఇప్పటికే ఎన్నో అప్‌డేటెడ్‌ వెర్షన్లు వచ్చాయి. ఆయుధాలే ప్రధానంగా సాగే ఈ ఆటలో.. తాజా పన్నెండో వెర్షన్‌లో మరిన్ని నూతన ఆయుధాలను ప్రవేశపెట్టనున్నారు. బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్‌ గేమ్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌  0.17.0 గా రానుంది.
(చదవండి : అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి గలాటా)

ఇక బాటిల్‌ గ్రౌండ్‌లో శత్రువులను ఎదుర్కొనే క్రమంలో గేమర్‌​ ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 12 వ సీజన్‌లో కీలకమైన డెత్‌ రీప్లే అవకాశం కల్పిస్తున్నారు. శత్రువుల దాడిలో గేమర్‌ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు డెత్‌ రీప్లే ఆప్షన్‌ తోడ్పడుతుంది. చేసిన పొరపాట్లేవో తెలుసుకుని, మరోసారి గేమర్‌ చనిపోకుండా కాపాడుకునేందుకు ఈ ఆప్షన్‌ సహకరిస్తుంది. ఇక పబ్‌జీ గేమ్‌తో మొబైల్స్‌కు అతుక్కుపోయే వారిని ఈ వెర్షన్‌ ఇంకెలా మారుస్తుందో మరి..! గంటల తరబడి పబ్‌జీలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, మానసిక రుగ్మతలు కొని తెచ్చుకున్న వారి గురించి తెలిసే ఉంటుంది..!
(చదవండి : ప్రాణం తీసిన పబ్‌జీ.. యువకుడికి బ్రైయిన్‌ స్ట్రోక్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top