కర్ణాటక యశవంతపుర : పబ్ జీ గేమ్‌కు బానిసైన యువకుడు మానసిక అస్వస్థతతో అర్ధనగ్నంగా తిరుగుతూ రాళ్లతో దాడి చేసిన ఘటన విజయపుర పట్టణంలో జరిగింది. పబ్‌జీ గేమ్‌కు అలవాటు పడిన యువకుడు మంగళవారం విజయపుర పట్టణంలోని మనగోలి అగసి వద్ద అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం రాళ్లతో కార్లు, బైక్‌లపై దాడి చేశాడు. పబ్‌జీలో మాదిరిగా బాంబ్‌లు విసిరినట్లు గలాటా సృష్టించాడు. దీంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
