ప్రాణం తీసిన పబ్‌జీ.. యువకుడికి బ్రైయిన్‌ స్ట్రోక్‌

Pune Man Dies Of Heart Attack While Playing PUBG - Sakshi

సాక్షి, పూణే : ఆన్‌లైన్‌గేమ్‌ పబ్‌జీకు వ్యవసపరుడిగా మారి.. ఓ యువకుడు ఏకంగా ప్రాణాల్ని తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రంలోని పూణేకు చెందిన హర్షల్‌ (27) గత రెండేళ్లుగా పబ్జీకి వ్యసనపరుడిగా మారాడు. ఏ పనీ లేకుండా 24 గంటలూ ఆదే ఆటలో మునిగితేలేవాడు. ఈ నేపథ్యంలోనే గత గురువారం తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. అయితే హర్ట్‌ ఎటాక్‌తో పాటు ఒకేసారి బ్రైయిన్‌ స్ట్రోక్‌ కూడా వచ్చిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతని మెదడులోని కణజాలం చిట్లి తీవ్ర రక్తస్రావం అయిందని, దీంతో హర్షల్‌ మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. కుమారుడు మృతిపై అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విపరీతంగా పబ్‌జీ ఆడటంమూలంగానే తమ కుమారుడు మృతిచెందాడని విలపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top