స్కూటీ అక్కడ.. నంబర్‌ ప్లేటు ఇక్కడ

Priyanka Murder Case: Mystery Continues On Scooter Number Plate - Sakshi

షాద్‌నగర్‌ టౌన్‌: హత్యకు గురైన పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి స్కూటీ నంబర్‌ ప్లేటు (టీఎస్‌ 08 ఈఎఫ్‌ 2677) షాద్‌నగర్‌ పరిధి లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి పక్కన పడి ఉంది. నిందితులు ప్రియాంకా రెడ్డిని తొండుపల్లి టోల్‌ ప్లాజా వద్ద అత్యాచారం చేసి హతమార్చి లారీలో చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. దుండగులు శివ, నవీన్‌ లారీ వెంట చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు వచ్చారు. ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని తగులబెట్టి ఆ తర్వాత స్కూటీ నంబర్‌ ప్లేటును  ఘటన స్థలం వద్దనే తొలగించి జాతీయ రహదారి పక్కనే చెట్లలో పడేశారు.

అయితే ఈ నంబర్‌ ప్లేటుపై ఎస్, ఎఫ్‌ అక్షరాలు లేవు. నంబర్‌ ప్లేటు తొలగిం చిన స్కూటీపై శివ, నవీన్‌ కొత్తూరు జేపీ దర్గా జంక్షన్‌ వద్దకు వెళ్లారు. మృతదేహం మంటల్లో పూర్తిగా కాలిపోయిందో.. లేదో.. చూసేందుకు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు మళ్లీ అదే స్కూటీపై వచ్చారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన విషయాన్ని గుర్తించి స్కూటీ పై కొత్తూరు జేపీ దర్గా జంక్షన్‌ వద్దకు వెళ్లారు. జేపీ దర్గా రోడ్డులో ఉన్న నాట్కో పరిశ్రమ సమీపంలో స్కూటీని విడిచి పెట్టి మిగతా ఇద్దరు నిందితులతో కలసి లారీలో పరారయ్యారు.  

కఠిన శిక్ష : డీజీపీ
సాక్షి, హైదరాబాద్‌: ప్రియాంకారెడ్డి హత్యపై డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఫాస్ట్‌ ట్రాక్‌ ట్రయల్‌ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. ఎవరు ఆపదలో ఉన్నా సరే 100 నంబర్‌కి డయల్‌ చేయాలని, లేదా హాక్‌ ఐ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డీజీపీ సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top