ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మోదీ | Prime minister narendra modi inaugurates retrofitted electric buses in parliament complex | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మోదీ

Dec 21 2015 5:33 PM | Updated on Aug 15 2018 2:20 PM

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మోదీ - Sakshi

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మోదీ

దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా పార్లమెంటు సభ్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెట్రోఫిటెడ్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు.

దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా పార్లమెంటు సభ్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెట్రోఫిటెడ్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రపంచం మొత్తం కాలుష్యం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి చాలా కాలంగా చర్చిస్తోంది గానీ, స్పందన మాత్రం చాలా ఆలస్యంగా మొదలైందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఈ బస్సుల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలను ఇస్రో తయారుచేస్తోందని ప్రధాని మోదీ ఆ తర్వాత తన ట్వీట్లలో చెప్పారు.

పార్లమెంటు ప్రాంగణంలోనే ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. బస్సు తాళాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందించగా, ఆమె తొలిసారిగా ఈ బస్సు ఎక్కారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని సిటీబస్సు సర్వీసులకు తరహా బస్సులను ప్రవేశపెడతామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. డీజిల్ బస్సులతో పోలిస్తే వీటి నిర్వహణ వ్యయం కూడా బాగా తక్కువని, దానివల్ల ఏడాదికి రూ. 8 లక్షలు ఆదా అవుతుందని గడ్కరీ చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement