ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మోదీ
దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా పార్లమెంటు సభ్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెట్రోఫిటెడ్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రపంచం మొత్తం కాలుష్యం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి చాలా కాలంగా చర్చిస్తోంది గానీ, స్పందన మాత్రం చాలా ఆలస్యంగా మొదలైందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ఈ బస్సుల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలను ఇస్రో తయారుచేస్తోందని ప్రధాని మోదీ ఆ తర్వాత తన ట్వీట్లలో చెప్పారు.
పార్లమెంటు ప్రాంగణంలోనే ఎలక్ట్రిక్ బస్సులను ఆయన ప్రారంభించారు. బస్సు తాళాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందించగా, ఆమె తొలిసారిగా ఈ బస్సు ఎక్కారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని సిటీబస్సు సర్వీసులకు తరహా బస్సులను ప్రవేశపెడతామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. డీజిల్ బస్సులతో పోలిస్తే వీటి నిర్వహణ వ్యయం కూడా బాగా తక్కువని, దానివల్ల ఏడాదికి రూ. 8 లక్షలు ఆదా అవుతుందని గడ్కరీ చెప్పారు.
The Retrofit Electric Bus launched in Parliament today is a part of our larger efforts to create clean public transport & minimise pollution
— Narendra Modi (@narendramodi) December 21, 2015
Retrofitted Electric Bus is cost effective & is at the core of @makeinindia initiative- @isro is making Lithium–Ion batteries.
— Narendra Modi (@narendramodi) December 21, 2015