ఆ దాడులు అనాగరికం : మోదీ | President Ram Nath Kovind PM Narendra Modi condemn Sri Lanka multiple blasts | Sakshi
Sakshi News home page

ఆ దాడులు అనాగరికం : మోదీ

Apr 21 2019 2:26 PM | Updated on Apr 21 2019 2:38 PM

President Ram Nath Kovind  PM Narendra Modi condemn Sri Lanka multiple blasts - Sakshi

నెత్తురోడిన కొలంబో

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 166 మందికి పైగా మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఆర్థిక మం‍త్రి అరుణ్‌ జైట్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొలంబో చర్చి, మూడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

శ్రీలంక ప్రజలకు భారత్‌ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని హింసకు తెగబడటం అనాగరిక చర్యని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ బాంబు పేలుళ్ల ఘటనను ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement