నిండుకున్న ఇంధనం.. నిండుచూలాలు మరణం | Pregnant woman dies as ambulance out of fuel | Sakshi
Sakshi News home page

నిండుకున్న ఇంధనం.. నిండుచూలాలు మరణం

Oct 6 2019 5:23 AM | Updated on Oct 6 2019 5:23 AM

Pregnant woman dies as ambulance out of fuel - Sakshi

భువనేశ్వర్‌: మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా, అంబులెన్సులో ఇంధనం అయిపోయి నిండు గర్భిణి మరణించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. హండా గ్రామానికి చెందిన తులసికి శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమెను సమీపంలోనిఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం మరోæ హాస్పిటల్‌కు అంబులెన్సులో తరలిస్తుండగా ఇంధనం అయిపోయింది. మరో అంబులెన్సు రావడానికి గంటకు పైగా పట్టింది. ఈలోగా గర్భిణి ప్రాణాలు వదిలింది.  ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement