ఇక మన బాధలన్నీ మర్చిపోవచ్చు : ప్రశాంత్‌ కిషోర్ | Prashant kishor tweets about  Donald Trump latest  comments | Sakshi
Sakshi News home page

ఇక మన బాధలన్నీ మర్చిపోవచ్చు : ప్రశాంత్‌ కిషోర్

May 29 2020 1:56 PM | Updated on May 29 2020 2:21 PM

Prashant kishor tweets about  Donald Trump latest  comments - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ:  భారత్‌ -చైనా సరిహద్దు వివాదం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌​ తాజా వ్యాఖ్యలపై రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  వ్యంగ్యంగా స్పందించారు. ఇక మన బాధలన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండొచ్చు...మన కష్టాలన్నీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లినట్టుగా కనిపిస్తోందంటూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసిక స్థితి గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌ ఉన్నారంటూ  ఆయన సెటైర్లు వేశారు  (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్)

కాగా ఇండో-చైనా సరిహద్దు వివాదంపై మధ్యవర్తిత్వం వహించేందుకు ఉత్సాహంగా ఉన్న ట్రంప్‌, ఈ విషయంలో మోదీ మాట్లాడే మూడ్‌లో‌ లేరంటూ   వ్యాఖ్యానించారు. అయితే  దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం ప్రధాని మోదీ, ట్రంప్‌ మధ్య ఇటీవలి కాలంలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం  చేసిన సంగతి తెలిసిందే.  (ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement