భారత్‌కు చైనా సరిహద్దు కాదన్న ట్రంప్‌

Donald Trump didnot know India-China share border - Sakshi

వాషింగ్టన్‌: పేరుకే అగ్రరాజ్యానికే అధ్యక్షుడే కానీ ఆయనకి భౌగోళిక సరిహద్దులపై కనీస అవగాహన కూడా లేదని తాజా పుస్తకం వెల్లడించింది. ఒకసారి చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని మోదీకే షాక్‌ ఇచ్చారట. ‘భారత్, చైనా సరిహద్దుల్ని పంచుకోవు కదా’అని ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో మోదీ ఒక్కసారిగా అవాక్కయ్యారు.  వాష్టింగ్టన్‌ పోస్టుకు చెందిన  ఫిలిప్‌ రకర్, కరోల్‌ లియోన్నింగ్‌ తమ తాజా పుస్తకం ‘ఏ వెరీ స్టేబుల్‌ జీనియస్‌‘లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌  కథనాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో ఏముందంటే ‘‘ఒకసారి మోదీ, ట్రంప్‌ సమావేశంలో భారత్‌కు, చైనా సరిహద్దు కాదని ట్రంప్‌ అనడంతో మోదీ ఆశ్చర్యపోయారు. ట్రంప్‌ ఏ మాత్రం సీరియస్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. అని మోదీ ట్రంప్‌ సహాయకుడితో వ్యాఖ్యానించారు’’అని ఆ పుస్తకం పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top