‘భోలో తా రా రా... క్రేన్‌ తీసుకురావాలా!’

Pop star Singer Daler Mehendi Shares Chandigarh Police Sang Pop Song And Control Traffic  - Sakshi

న్యూఢిల్లీ: పట్టణాల్లో ట్రాఫిక్‌ని కంట్రోల్‌ చేయడం అంటే సాధారణ విషయమేమి కాదు. వాహనదారులను ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా చేయడానికి పోలీసులు నానాతంటాలు పడాల్సి వస్తుంది. వాహనాలను రాంగ్‌ పార్కింగ్‌లో నిలిపినా, రాంగ్‌ రూట్‌లో వెళ్లినా ట్రాఫిక్‌ పోలీసులు విజిల్స్‌తో హెచ్చరిస్తుంటారు.. అయినా పట్టించుకోకుండా వాహనదారులలో కొంతమంది తాము వెళ్లాలనుకున్న దారిలోనే వెళ్తుంటారనుకోండి అది వేరే విషయం.

ఇటువంటి ఘటనలతో చిర్రెత్తుకువచ్చిందేమో ఏమో.. క్రమశిక్షణ లేని వాహనదారులను గాడిలో పెట్టేందుకు ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ కొత్త దారి ఎంచుకున్నారు. ఇందుకోసం ఓ పాప్‌ సింగర్‌ పాడిన ‘భోలో తరా రా రా..’ పాటను ఫాలో అయ్యాడు. దీంతో ఆ పాట విన్న వాహనదారులు అప్రమత్తమవుతున్న వీడియో చూసిన ప్రముఖ పాప్‌ సింగర్‌ దలేర్‌ మహాంది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వివరాలు.. చండీగడ్‌లోని ఓ ట్రాఫిక్‌ పోలీసు వాహనాలను రాంగ్‌ ప్లేస్‌లో పార్క్‌ చేయగానే మైక్‌లో ప్రముఖ పాప్‌ సింగర్‌ దలేర్‌ మెహాందీ పాడిన పాపులర్‌ పాటను తలపించేలా ‘భోలో తా రా రా... క్రేన్‌ తీసుకురావాలా!’ అంటూ పాట పాడి ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో... ‘నా పాటతో ప్రజలను ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించేలా ప్రేరేపితం చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.  ఆనందం అంటే దలేర్‌ మహాంది. వేడుక అంటే దలేర్‌ మహాంది. మీ సపోర్టుకు ధన్యవాదాలు.. లవ్‌ యూ’ అనే క్యాప్షన్‌తో దలేర్‌ ఈ వీడియోను గురువారం షేర్‌ చేశారు. ఇక అప్పటినుంచి వీడియోకు వేలల్లో వ్యూస్‌ రాగా.. వందల్లో లైక్స్‌ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే ‘హా హ్హ హ్హ.. ఇది చాలా బాగుతుంది, మంచి ఐడియా, సింగ్‌ గారి నో పార్కింగ్‌’ సాంగ్‌  అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం పాప్‌స్టార్‌ దలేర్‌... ‘స రి గ మ పా’ అనే మ్యుజిక్‌ రియాలీటి షోలో జడ్జీగా వ్యవహరిస్తున్నవిషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top