
రాజకీయులకు, యాంకరమ్మలకు లింకేమిటి?
రాజకీయ నాయకులకు టీవీ యాంకర్లకు మధ్య సాన్నిహిత్యం కొత్త కాదు. గతంలోనూ పలువురు రాజకీయ నాయకులు టీవీ యాంకర్లకు మధ్య సంబంధాలున్నాయంటూ కథనాలు వచ్చాయి.
రాజకీయ నాయకులకు టీవీ యాంకర్లకు మధ్య సాన్నిహిత్యం కొత్త కాదు. గతంలోనూ పలువురు రాజకీయ నాయకులు టీవీ యాంకర్లకు మధ్య సంబంధాలున్నాయంటూ కథనాలు వచ్చాయి. చాలా సందర్భాల్లో నాయకులు వీటిని ఖండించారు. కానీ గుసగుసలు మాత్రం ఆగలేదు.కొన్ని ఫేమస్ పొలిటికల్ 'అఫైర్లు' ఇవి
శశిథరూర్ - మెహర్ తరార్ - తిరువనంతపురం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కి పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ కి మధ్య సంబంధాలున్నాయని థరూర్ భార్య సునందా పుష్కర్ ఆరోపించారు. ఆమె అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అయితే అటు శశి, ఇటు మెహర్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు.
ఉమర్ అబ్దుల్లా - నిధి రజ్దాన్ - జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తన భార్యకు విడాకులు ఇవ్వడంతో ఆయనకు , టీవీ యాంకర్ రజ్దాన్ కి మధ్య సంబంధాలున్నాయని, ఆ కారణం వల్లనే ఆయన విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు.
సుబోధ్ కాంతి సహాయ్ - రేఖా సహాయ్ - పలు సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఉన్న సుబోధ్ కాంత్ సహాయ్ టీవీ, థియేటర్ సెలబ్రిటీ రేఖా సహాయ్ ను వివాహం చేసుకున్నారు.
అమరీందర్ సింగ్ - ఆరూసా ఆలమ్ - పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ కి పాకిస్తానీ జర్నలిస్టు అరూసా ఆలమ్ కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 2004 లో ఆయన పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆలమ్ పరిచయం అయింది. అప్పట్నుంచి పంజాబీ రాజకీయాల్లో అంతా కమాన్ గుసగుసే....చివరికి ఆమె పంజాబ్ వచ్చి చండీగఢ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ నాకు అమరీందర్ కి స్నేహం తప్ప మరేమీ లేదని ప్రకటించాల్సి వచ్చింది.