పోలీసులు చెప్పినందుకే.. | Sakshi
Sakshi News home page

పోలీసులు చెప్పినందుకే..

Published Sun, Oct 7 2018 3:16 AM

Police instructed to switch off CCTV cameras, says appolo hospitals - Sakshi

చెన్నై: తమిళనాడు సీఎం దివంగత జయలలితకు చికిత్స సందర్భంగా ఆసుపత్రి కారిడార్లలో సీసీటీవీలను పోలీసుల సూచన మేరకే ఆపేశామని అపోలో ఆసుపత్రి ఆర్ముగస్వామి కమిషన్‌కు తెలిపింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఐజీ సత్యమూర్తి ఆదేశాల మేరకే ఇలా చేశామని అపోలో గ్రూప్‌ న్యాయవాది కమిషన్‌ముందు అఫిడవిట్‌ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జయలలితను గది నుంచి బయటకు తీసుకొచ్చిన సమయంలో కారిడార్లలో సీసీటీవీలను ఆపేయడంతో పాటు మెట్లదారిని మూసివేసేవారమని ఆమె తెలిపారు. లిఫ్ట్‌ ద్వారా ఆమెను వేరే అంతస్తులోకి తరలించాల్సి వస్తే మిగతా లిఫ్టులను నిలిపివేసేవాళ్లమన్నారు. జయలలిత చికిత్స గదిలోకి వెళ్లిపోగానే సీసీటీవీలను ఆన్‌ చేసేవాళ్లమని అపోలో గ్రూప్‌ న్యాయవాది పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement