బర్త్‌డే రోజు గుజరాత్‌లో ప్రధాని బిజీబిజీ.. | PM Will Visit Sardar Sarovar Dam In Gujarat | Sakshi
Sakshi News home page

బర్త్‌డే రోజు గుజరాత్‌లో ప్రధాని బిజీబిజీ..

Sep 17 2019 8:00 AM | Updated on Sep 17 2019 8:02 AM

PM Will Visit Sardar Sarovar Dam In Gujarat - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ తన 69వ జన్మదినం సందర్భంగా గుజరాత్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం 69వ ఏట అడుగుపెట్టారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని తొలుత గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్‌ను కలుసుకుని ఆమె ఆశీస్సులు పొందారు. 98 సంవత్సరాల హీరాబెన్‌ తన చిన్న కుమారుడు పంకజ్‌ మోదీతో కలిసి రైసిన్‌ గ్రామంలో నివసిస్తున్నారు. తల్లి ఆశీస్సులు తీసుకున్న అనంతరం గాంధీనగర్‌ నుంచి ఆయన నర్మదా జిల్లాలోని కెవదియా చేరుకుని అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా నర్మదా నదీ తీరంలో మా నర్మద పూజ నిర్వహించడంతో పాటు సర్ధార్‌ సరోవర్‌ డ్యామ్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శిస్తారు. గరుడేశ్వర్‌లో దత్తాత్రేయ మందిరాన్ని సందర్శించిన అనంతరం కెవదియాలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement