'ఆ సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిది..' | PM narendramodi played a decisive role at COP 21: hollande | Sakshi
Sakshi News home page

'ఆ సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిది..'

Jan 24 2016 5:17 PM | Updated on Aug 15 2018 6:34 PM

'ఆ సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిది..' - Sakshi

'ఆ సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిది..'

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు చండీగఢ్కు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్కు భారత్-ఫ్రాన్స్ బిజినెస్ ఫోరం ఘన స్వాగతం పలికింది.

చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు చండీగఢ్కు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్కు భారత్-ఫ్రాన్స్ బిజినెస్ ఫోరం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా హోలాండ్ను ప్రధాని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటించినున్న విషయం తెలిసిందే. చండీగఢ్‌లో నేడు(ఆదివారం) జరుగుతున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత ఏడాది హోలాండ్తో ఐదుసార్లు భేటీ అయ్యే అవకాశం లభించిందని అన్నారు.

ప్రపంచం మొత్తానికి గొప్ప విశ్వాసాన్ని, ఆశాభావాన్ని అందించిగల దేశం భారత్ అని అన్నారు. భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, గొప్పశ్రామికశక్తిగల దేశమని, ప్రపంచ దేశాల వస్తువులకు భారత్ గొప్ప మార్కెట్ అని గుర్తు చేశారు. అనంతరం హోలాండ్ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన కాప్ 21 సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిదని, నిర్ణయాత్మకం అని కొనియాడారు. భారత్తో దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వాణిజ్య కార్యకలాపాలన పెంచుతామని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కూడా ముందడుగు వేస్తామని చెప్పారు.  ఈ సదస్సు తర్వాత హోలాండే ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. అనంతరం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement