breaking news
CEO Forum
-
అమెరికా సీఈవో ఫోరంపై నాస్కామ్ కసరత్తు
భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.కొత్త ఆవిష్కరణలు, పాలసీలు, నిపుణులను తయారు చేసుకోవడం వంటి అంశాలపై అత్యున్నత స్థాయి లో సంప్రదింపులు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని నాస్కామ్ పేర్కొంది. ప్రవాస భారతీయులు, ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్ట్మెంట్, మేధావులు, విద్యావేత్తలు మొదలైన వర్గాలను సమన్వయపర్చడం ద్వారా భారత్–అమెరికా టెక్ భాగస్వామ్యాన్ని పటిష్టపర్చేందుకు సహాయకరంగా ఉంటుందని తెలిపింది.భారతీయ టెక్నాలజీ కంపెనీలు అమెరికా అంతటా డిజిటల్ పరివర్తనను శక్తివంతం చేయడమే కాకుండా, ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడం, నిజమైన ప్రభావాన్ని అందించే ఆవిష్కరణలను నడిపిస్తున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ అన్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ సీఈఓ అమిత్ చద్దా, విప్రోలో అమెరికాస్ వన్ సీఈఓ మలయ్ జోషితో పాటు నంబియార్ ఈ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని నాస్కామ్ తెలిపింది. -
'ఆ సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిది..'
చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు చండీగఢ్‌కు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్కు భారత్-ఫ్రాన్స్ బిజినెస్ ఫోరం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా హోలాండ్ను ప్రధాని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటించినున్న విషయం తెలిసిందే. చండీగఢ్‌లో నేడు(ఆదివారం) జరుగుతున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత ఏడాది హోలాండ్‌తో ఐదుసార్లు భేటీ అయ్యే అవకాశం లభించిందని అన్నారు. ప్రపంచం మొత్తానికి గొప్ప విశ్వాసాన్ని, ఆశాభావాన్ని అందించిగల దేశం భారత్ అని అన్నారు. భారత్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, గొప్పశ్రామికశక్తిగల దేశమని, ప్రపంచ దేశాల వస్తువులకు భారత్ గొప్ప మార్కెట్ అని గుర్తు చేశారు. అనంతరం హోలాండ్ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన కాప్ 21 సదస్సులో మోదీ పాత్ర వర్ణించలేనిదని, నిర్ణయాత్మకం అని కొనియాడారు. భారత్‌తో దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వాణిజ్య కార్యకలాపాలన పెంచుతామని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కూడా ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ సదస్సు తర్వాత హోలాండే ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. అనంతరం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.