కోహ్లి చాలెంజ్‌ సంతోషానిచ్చింది: మోదీ

PM Narendra Modi Talks on Mann Ki Baat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికరమైన అంశాలపై మాట్లాడారు. క్లీన్‌ ఇండియా, యోగా, ఫిట్‌నెస్‌, సాంప్రదాయ క్రీడలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మోదీ మాట్లాడుతూ... దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, స్వాతంత్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌కు నివాళి అర్పించారు. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడిగా వీర్‌ సావర్కర్‌ను వర్ణించారు.

ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ నడుస్తోంది
ఫిట్‌నెస్ పై అందరూ అవగహన పెంచుకోవాలని ప్రధాని కోరారు. ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించాలని, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సైనికులు, ఉద్యోగులు ఇతరులుకు ఫిట్‌నెస్‌పై అవగహన కల్పించాలన్నారు. ‘హమ్‌ ఫిట్‌ ఇండియా ఫిట్‌’ అని నినాదమిచ్చారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తనకు ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ చేయడం సంతోషానిచ్చిందని, ఆ చాలెంజ్‌ను తాను స్వీకరిచానని మోదీ తెలిపారు.

క్రీడలపై మాట్లాడుతూ.. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. సాం‍ప్రదాయ క్రీడలు భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. మన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత యువతపై ఉందని, ప్రతి ఒక్కరి బాల్యం క్రీడలతోనే ప్రారంభవుతుందని గుర్తుచేశారు.

క్లీన్‌ ఇండియా, గ్రీన్‌ ఇండియా
ప్రపంచ పర్యవరణ దినోత్సవంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యవరణంపై ప్రతీ ఒక్కరు శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు ప్రకృతిపై ప్రభావం చుపుతున్నాయన్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫానుల బీభత్సం, అకాల వర్షలకు ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్లాస్టిక్‌ కాలుష్యంపై అవగహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top