మోదీ 2.0

PM Narendra Modi One Year Completed On Second Term - Sakshi

ఫస్ట్‌ హాఫ్‌ సూపర్‌ హిట్‌

రెండో సగంలో కోవిడ్‌ ఎఫెక్ట్‌

రేపటితో మోదీ పాలనకు ఏడాది 

సబ్‌కా సాథ్‌ , సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌  అన్న స్ఫూర్తితో తొలుత అడుగులు బలంగానే పడ్డాయి.   ఆత్మ విశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలతో అనుకున్నవి సాధించారు ఆరు నెలల్లోనే పట్టు సడలింది. అడుగులు తడబడ్డాయి.   సీఏఏ వ్యతిరేక నిరసనలు కేంద్రానికి గట్టిగానే తాకాయి.   దాని నుంచి బయటపడకుండానే కరోనా కసిగా కాటేసింది.   కొన్ని విజయాలు, మరిన్ని వైఫల్యాలతో మోదీ ఏడాది పాలన సాగిందిలా..  

ఆరంభం అదిరిపోయింది. కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన విజయోత్సాహంతో మొదటి ఆరు నెలలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూకుడుకి ఎవరూ కళ్లెం వేయలేకపోయారు. 2019, మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన కుడిభుజమైన అమిత్‌షాకి హోంమంత్రి పదవి కట్టబెట్టి పక్కా ప్రణాళికతో అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా మోదీ అడుగులు వేశారు.

ఒకే దేశం, ఒకే రాజ్యాంగం కల తీరేలా ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌తో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరే అవకాశం రావడం, 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టిన సంస్కరణలు, రైతు ఆదాయం, మహిళా సాధికారత చర్యలు, కార్మిక సంస్కరణలు, ముస్లిం మహిళలకి భారీ ఊరటనిచ్చే ట్రిపుల్‌ తలాక్‌ చట్టం వంటివి మోదీ క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి.

రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా వివాదాస్పద బిల్లులు గట్టెక్కేలా చేసిన వ్యూహరచన మోదీకి రాజకీయంగా ఎదురులేకుండా చేసింది. ఇక గత సెప్టెంబర్‌లో అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన హౌదీ మోదీ కార్యక్రమం ఆయన ఇమేజ్‌ను పెంచింది. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవ అతిథిగా హాజరవడమే కాకుండా మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరిలో ట్రంప్‌ భారత్‌ పర్యటనకు రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి.  
 
రెండో సగంలో తడబడిన అడుగులు
పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలు (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజుకున్న ఉద్యమం మోదీ మొదటి వైఫల్యంగా చెప్పుకోవాలి. ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఎన్నార్సీని తీసుకురావడానికి ముందు జరిగే ప్రక్రియగా సీఏఏని తీసుకువచ్చారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆ చట్ట ఉద్దేశాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లడంలోనూ, ముస్లింలలో భద్రతను నెలకొల్పడంలోనూ మోదీ సర్కార్‌ విఫలమైంది. రోజు రోజుకి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం, పెరిగిపోతున్న నిరుద్యోగం వంటివి ఈ ఏడాది కాలంలో మోదీ వైఫల్యాలే.

ఇక రాజకీయంగా రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో పిల్లి మొగ్గలు వంటివి మోదీ క్రేజ్‌ని తగ్గించాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న సమయంలో కరోనా విజృంభణ దేశాన్ని ఆర్థికంగా మరింత అతలాకుతలం చేసింది. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో మోదీ విజయం సాధించినప్పటికీ, ఆర్థికంగా దేశాన్ని గాడిలో పెట్టే చర్యల్లో విఫలమయ్యారని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.  

ట్రిపుల్‌ తలాక్‌ వ్యతిరేక చట్టం
ముస్లిం సమాజంలో నోటి మాటతో మూడుసార్లు తలాక్‌ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతిని వ్యతిరేకిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చింది. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా బిల్లు పాస్‌ అయ్యేలా వ్యూహరచన చేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ముస్లిం మహిళల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకున్నారు.

సీఏఏ, ఎన్నార్సీ
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌లలో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత్‌ పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ చట్టానికి సవరణలు చేశారు. ఇందులో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో బిల్లును ఆమోదించినప్పటికీ దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. ముస్లిం సోదరుల్లో ఒక అభద్రతా భావాన్ని నింపింది.  
 
కోవిడ్‌ వీరుడు  
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌కీ పలు సవాళ్లు విసిరింది. భౌతిక దూరం మినహా దీనిని అడ్డుకునే దారి లేకపోవడంతో 130 కోట్ల జనాభా కలిగిన దేశాన్ని సంపూర్ణంగా లాక్‌డౌన్‌ ప్రకటించాలన్న అత్యంత సాహసోపేత నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నారు. సరైన సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల ఆరోగ్య రంగంపై పెనుభారం పడకుండా కాపాడగలిగారు. పల్లెలకి వైరస్‌ విస్తరించకుండా నిరోధించడంలో విజయవంతమయ్యారు. మోదీ మాటకి కట్టుబడి దేశం అంతా ఏకతాటిపై నిలుస్తూ తొమ్మిది వారాల లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించడం ఆయనకున్న బలాన్ని తెలియజేస్తుంది.

వలస కార్మికుల తరలింపులో గందరగోళం నెలకొని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వైరస్‌ విస్తరణను సమర్థవంతంగానే అడ్డుకోగలిగారు. ఇప్పుడు ప్రధాన మెట్రో పాలిటిన్‌ నగరాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కేసులైతే నమోదు కావడం లేదు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లోనే మోదీ నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ సర్వే ప్రకారం మోదీ తీసుకున్న కరోనా కట్టడి చర్యల్ని దేశంలో 82 శాతం మంది ప్రశంసించారు. ఈ స్థాయిలో ప్రజాదరణ ప్రపంచ దేశాల్లో మరే నాయకుడికి దక్కలేదు. కోవిడ్‌తో నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించినప్పటికీ దానికి ఆశించినంత సానుకూలత లభించలేదు.

రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్‌
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో చేసిన ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. 2019, నవంబర్‌ 9న యూపీలో అయోధ్య నిర్మాణానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన మూడు నెలల్లోనే ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. అయితే కరోనా వైరస్‌ మందిర నిర్మాణ పనులకు అడ్డంకిగా మారింది.

ఆర్టికల్‌ 370 రద్దు
రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేసి రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి తాను అనుకున్నది విజయవంతంగా అమలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
17-02-2022
Feb 17, 2022, 18:38 IST
కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. ... 

Read also in:
Back to Top