సాయుధ బలగాల సంక్షేమానికి తోడ్పడండి | PM Narendra Modi launches fund-raising initiative for Armed forces | Sakshi
Sakshi News home page

సాయుధ బలగాల సంక్షేమానికి తోడ్పడండి

Dec 8 2019 4:44 AM | Updated on Dec 8 2019 4:44 AM

PM Narendra Modi launches fund-raising initiative for Armed forces - Sakshi

ఫ్లాగ్‌డే సందర్భంగా మోదీ కోటుకు జెండాను పిన్‌ చేస్తున్న చిన్నారి

పుణె: సాయుధ బలగాల సంక్షేమానికి ప్రజలు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శనివారం పుణేలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఆర్ముడ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడే ఆయన 2016లో నగ్రోటా ఉగ్రదాడిలో నేలకొరిగిన మేజర్‌ కునాల్‌ గోసావి భార్య, కుమార్తెలతో మాట్లాడారు. అనంతరం ఫ్లాగ్‌ డే కార్యక్రమానికి సంబంధించిన 57 నిమిషాల వీడియోను ప్రధాని ట్విట్టర్‌లో విడుదల చేశారు.

‘ఆర్ముడ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా అత్యుత్తమ ధైర్య సాహసాలు చూపుతున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబాలకు నా సెల్యూట్‌. మన బలగాల సంక్షేమానికి మీరు కూడా సాయం అందించాల్సిందిగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం పోలీస్‌ డైరెక్టర్‌ జనరళ్లు, ఇన్‌స్పెక్టర్‌ జనరళ్ల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చిలో జరిగిన ఈ సదస్సుకు హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరయ్యారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారంతో ముగియనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement