గురువాయుర్‌లో మోదీ తులాభారం

PM Modi Visits Guruvayur In Kerala And Offers Prayers To Lord Krishna - Sakshi

శ్రీకృష్ణుణ్ణి దర్శించుకున్న ప్రధానమంత్రి

రేపు తిరుమలకు రాక

సాక్షి, అమరావతి :  సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేరళలో పర్యటించారు. త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌ ఆలయంలో కమలం పూలతో తులాభారం వేయించుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు. ఈ మధ్యలో ఆయన మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
(రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక)


కొలంబో నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రధాని రాకను పురస్కరించుకుని విమానాశ్రయానికి అతి సమీపంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు విజయోత్సవ సభగా నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. సభ అనంతరం ప్రధాని స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top