మన్మోహన్ సింగ్కు మోదీ శుభాకాంక్షలు | PM modi greets Manmohan Singh on birthday | Sakshi
Sakshi News home page

మన్మోహన్ సింగ్కు మోదీ శుభాకాంక్షలు

Sep 26 2016 9:48 AM | Updated on Aug 21 2018 9:33 PM

మన్మోహన్ సింగ్కు మోదీ శుభాకాంక్షలు - Sakshi

మన్మోహన్ సింగ్కు మోదీ శుభాకాంక్షలు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మన్మోహన్ సింగ్ తన 83వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ.. మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే.. మోదీ స్వంయంగా మన్మోహన్తో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గల ఘా అనే గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు.
 
Advertisement
 
Advertisement
Advertisement