‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు

PM Modi asks officials to remove hurdles in Housing for all by 2022 mission - Sakshi

ఉన్నతాధికారులకు మోదీ ఆదేశం

న్యూఢిల్లీ: 2022కల్లా అందరికీ ఇళ్లు పథకం లక్ష్యా న్ని చేరుకోవడంలో ఎదురయ్యే అవాంతరాలను తొలగించాలని ఉన్నతాధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కేంద్రంలో రెండోసారి ఎన్‌డీఏ సర్కార్‌ కొలువుదీరాక తొలి ‘ప్రగతి  (ప్రో–యాక్టివ్‌ గవర్నెన్స్‌ అండ్‌ టైమ్లీ ఇంప్లిమెంటేషన్‌) సమీక్షా సమావేశం బుధవారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పీఎం ఆవాస్‌ యోజన(పట్టణ) పథకంలో ఎదురవుతున్న అవాంతరాలను ఎలా అధిగమించాలనే దానిపై సమీక్షించారు.

‘నీటి సంరక్షణపైన ప్రత్యేకంగా వానాకాలంలో తీసుకున్న చర్యలపైనా రాష్ట్రాలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ప్రధాని సూచించారు’ అని ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. మోదీ ప్రధానిగా ఎన్‌డీఏ తొలి పాలన కాలంలో ఇలాంటి 29 ‘ప్రగతి’ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రూ.12లక్షల కోట్ల విలువైన 257 ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రజా సమస్యలు, అందరికీ ఆరోగ్యబీమా పథకమైన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ అంశాలపైనా సమీక్ష జరిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top