బడ్జెట్‌ 2019 : అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ. 3000 పెన్షన్‌

Piyush Goyal Announces Pension Scheme For Informal Workers - Sakshi

న్యూఢిల్లీ : 60 ఏళ్లు పూర్తయిన అసంఘటిత రంగం కార్మికులకు  నెలకు 3 వేల రూపాయల పెన్షన్‌ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకుగాను త్వరలోనే ‘ప్రధాన్‌ మంత్రి శ్రమ్‌ యోగి మంధన్‌’ పెన్షన్‌ పథకాన్ని తీసుకురాన్నట్లు తెలిపారు. ఇందుకు గాను నెలకు రూ. 100 జమ చేయాల్సి ఉంటుంది.

అసంఘటిత రంగ కార్మికుల పెన్షన్‌ స్కీమ్‌కు గాను రూ. 500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా10 కోట్ల మంది లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సంర నుంచే అమలు చేయనున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top