గులాబీమయమవుతున్న యమునా నది | Pink Foam Flowing In The Yamuna Is Toxic Industrial Waste | Sakshi
Sakshi News home page

గులాబీమయమవుతున్న యమునా నది

Mar 26 2016 6:08 PM | Updated on Sep 3 2017 8:38 PM

గులాబీమయమవుతున్న యమునా నది

గులాబీమయమవుతున్న యమునా నది

అత్యంత ప్రమాదకర స్థాయిలో యమునా నది కలుషితం అవుతుందనడానికి నిదర్శనమీ దృశ్యం.

ఢిల్లీ : గులాబీరంగు నురుగ చూడడానికి ఎంతో ఇంపుగా కనిపిసిస్తుందనుకుంటున్నారా?.. అత్యంత ప్రమాదకర స్థాయిలో యమునా నది కలుషితం అవుతుందనడానికి నిదర్శనమీ దృశ్యం. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్‌లో యమునా నదిలోకి వచ్చి చేరుతున్న వ్యర్థాలు ఈ రకమైన గులాబీరంగు నురగను ఉత్పత్తి చేస్తున్నాయి.

బట్టల పరిశ్రమల నుంచి బయటకు వదిలేస్తున్న వ్యర్థాలలోని విషపూరితమైన రసాయనాల వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. దేశ రాజధానిలో ఉన్న 19 నాలాల నుంచి వ్యర్థాలు యమునా నదిలోకి వచ్చి చేరుతున్నాయి. విషపూరిత రసాయనాల వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 సంవత్సరం నాటికి యమునా నీటిలో ఈతకొడుతాం, యమునా నీటిని తాగుతామంటూ కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టే హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాగునీరు దేవుడెరుగు కాలుష్యం మరింత పెరుగకుండా చూస్తే చాలు అని అక్కడి స్థానికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement