ముంబైలో పెట్రోల్‌ రూ.90 | Petrol crosses Rs 90-mark in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో పెట్రోల్‌ రూ.90

Sep 25 2018 5:46 AM | Updated on Sep 25 2018 5:46 AM

Petrol crosses Rs 90-mark in Mumbai - Sakshi

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా సామాన్యుడి నడ్డివిరుస్తున్న పెట్రోల్‌ ధరలు సోమవారం ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. దేశ ఆ ర్థిక రాజధాని ముంబైలో తొలిసారిగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90 మార్క్‌ను దాటి రికార్డ్‌ సృష్టించింది. ముంబై నగరంలోని ఐవోసీ ఔట్‌లెట్లలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 90.08, డీజిల్‌ రూ.78.58. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవటంతో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 5 పైసలు పెంచాయి.

Advertisement
 
Advertisement
Advertisement