అదృష్టవంతురాలిని | Palak Muchhal: I owe a great deal of my success to Salman sir | Sakshi
Sakshi News home page

అదృష్టవంతురాలిని

Jul 29 2014 10:24 PM | Updated on Sep 2 2017 11:04 AM

అదృష్టవంతురాలిని

అదృష్టవంతురాలిని

సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ పాట పాడే అవకాశం లభించడం తన అదృష్టమంటూ గాయని పాలక్ ముచ్చల్ పొంగిపోయింది. ‘కిక్’ సినిమాలో ‘జుమ్మే కీ రాత్’ అనే పాటను సల్మాన్‌తో

సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ పాట పాడే అవకాశం లభించడం తన అదృష్టమంటూ గాయని పాలక్ ముచ్చల్ పొంగిపోయింది. ‘కిక్’ సినిమాలో ‘జుమ్మే కీ రాత్’ అనే పాటను సల్మాన్‌తో కలిసి పాడడం తనకు మంచి కిక్కు ఇచ్చిందంది. తన కెరీర్‌లో హిమేశ్ రేషమ్మియా, సల్మాన్‌లు కీలకపాత్ర పోషించారంది. ‘సల్మాన్‌ఖాన్‌తో కలసి ఓ పాట పాడాలనేది నా కల. ఓ రోజు సరదాగా ఈ విషయాన్ని సల్మాన్ సార్‌కు చెప్పా. ఆయనయన కూడా ఓ మంచి గాయకుడే కావడంతో నా మనసులో మాట చెప్పా. హిమేశ్ అందరితోనూ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాడు.
 
 ఎటువంటి పరిమితులు ఉండవు. హిమేశ్ కోసం నేను ఓ పాట కూడా పాడాను. అది నాకు ఎంతో ఉత్సాహం కలిగించింది. ఈ పాట పాడే సమయంలో నా దృష్టిని, హృదయాన్ని పూర్తిస్థాయిలో కేంద్రీకరించాను’ అని అంది. ఈ పాటలో సల్మాన్ భాగస్వామ్యంపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ఎంతో సంతోషం కలిగిందంది. 14 ఏళ్ల వయసులోనే తాను సల్మాన్‌ను తొలిసారిగా కలిశానని చెప్పింది. ‘వీర్’ సినిమాలో ‘మెహర్బానియా’ అనే పాట తానే పాడానని తెలిపింది.
 
 ‘దస్ కా దం’ షోలో పాల్గొనాల్సిందిగా తనను కోరాడంది. అతడికి తాను ఎంతో రుణపడి ఉన్నానంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు తరచూ తాను కూడా ఆర్థిక సహాయం అందిస్తుంటానంది. ఇందుకు సల్మాన్ కూడా తనవంతు సహకారం అందజేస్తున్నాడంది. ‘లా పతా’ సినిమాతో బాలీవుడ్ రంగంలోకి అడుగిడినట్టు చెప్పింది. ఆ తర్వాత ‘ఆషికి 2’లో పాడానని, ఇప్పటికి మొత్తం 142 పాటలు పాడానని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement