మరోసారి కాల్పులకు తెగబడిన పాక్ | Pakistan opens fire on international border in Jammu | Sakshi
Sakshi News home page

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

Aug 17 2014 9:04 AM | Updated on Mar 23 2019 8:29 PM

పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతుందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు. బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై పాక్ సైన్యంపైకి కాల్పులు జరుపుతున్నారని చెప్పారు.

అయితే గత అర్థరాత్రి నుంచి ఇరువైపులా కాల్పులు హోరాహోరిగా కొనసాగుతున్నాయని తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో మన జవాన్లకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement