మరోసారి తెగబడ్డ పాకిస్తాన్‌ | Pak violates ceasefire again, heavy firing in parts of Poonch | Sakshi
Sakshi News home page

మరోసారి తెగబడ్డ పాకిస్తాన్‌

Mar 13 2017 8:59 AM | Updated on Mar 23 2019 8:04 PM

జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఫూంచ్‌ జిల్లాలోని మల్టీ సెక్టార్‌లో పాక్‌ సైన్యాలు సోమవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డాయి. నాలుగు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారు. కాగా 24 గంటల్లో పాక్‌ కాల్పులకు పాల్పడటం ఇది రెండోసారి. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ సైన్యానికి భారత జవాన్లు ధీటుగానే బదులు ఇస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం కూడా కృష్ణఘటి సెక్టార్‌లో పాక్‌ సైన్యాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల ఘటనపై రక్షణ శాఖ అధికారి మాట్లాడుతూ పాక్‌ కాల్పులను భారత్‌ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement