ఒడియా విద్యార్థుల ఉన్నతికి సహకరిస్తాం | Orissa Minister Visited Srikakulam | Sakshi
Sakshi News home page

ఒడియా విద్యార్థుల ఉన్నతికి సహకరిస్తాం

Jul 26 2018 3:55 PM | Updated on Sep 2 2018 4:52 PM

Orissa Minister Visited Srikakulam - Sakshi

విద్యార్థిని విద్యా సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న ఒడిశా మంత్రి బద్రినారాయణపాత్రొ 

ఇచ్ఛాపురం : ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా విద్యార్థుల ఉన్నతికి తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించనుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బద్రినారాయణ పాత్రో హామీ ఇచ్చారు. పట్టణంలోని మున్సిపల్‌ ప్రాథమిక ఒడియా పాఠశాల, ప్రభుత్వోన్నత పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఒడి యా విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వోన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ఒడియా విద్యార్థుల రెండో భాషగా తెలుగు, హిందీలకు 50 మార్కుల చొప్పున కేటాయించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి స్పందించి ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరిస్తానని హామీఇచ్చా రు. ఈ పర్యటనలో భాగంగా బాపూజీ పట్‌ఘర్‌(ఒడియా  గ్రంథాలయం)లో ఒడియా సంస్కృతి ని వివరించే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒడియా విద్యార్థులకు అవసరమయ్యే ఒడియా పుస్తకాల ను కూడా సరఫరా చేస్తామన్నారు.

అనంతరం ఒడిశాలోని గంజాం, గజపతి, రాయఘడ జిల్లాల్లో తెలుగు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని విశ్రాంత ఉపాధ్యాయుడు కే.మోహన్‌రావు, పతంజలి సంజయ్‌ రెడ్డి, కొండాశంకర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం, ఉత్కలాంధ్ర ఒడియా మైనార్టీ అధ్యక్షుడు సత్యనారాయణపాడి, ఉత్కల్‌ సమ్మేళన్‌ అధ్యక్షుడు అద్వైత్‌కుమార్‌పాత్రో, అనంత్‌ జెన్నా, బిమల్‌చంద్ర సడంగి, ఉషాదేవి, పూర్ణమహా పాత్రో, తహసీల్దారు సురేష్, అనంత్‌కుమార్‌ మహాపాత్రో,  కే.అప్పారావు, సాగరిక, బృందా వన్‌ దోళాయి, ఏపీ, ఒడియా టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement