జస్టిస్‌ లోయా మృతిపై సిట్‌ విచారణ జరపండి | Opposition MPs call on President, submit memorandum demanding Supreme Court-monitored probe | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ లోయా మృతిపై సిట్‌ విచారణ జరపండి

Feb 10 2018 3:19 AM | Updated on Nov 6 2018 4:42 PM

Opposition MPs call on President, submit memorandum demanding Supreme Court-monitored probe - Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ జడ్జి బీహెచ్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ బృందంతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్రపతి∙కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ నేతృత్వంలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల బృందం రాష్ట్రపతిని కలసి వినతిపత్రం అందచేసింది. ‘ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం. సీబీఐ, ఎన్‌ఐఏలపై మాకు విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎంపిక చేసిన స్వతంత్ర అధికారుల బృందంతో దర్యాప్తు చేయించాలని మేం కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలకు చెందిన 114 మంది ఎంపీలు వినతిపత్రంపై సంతకాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement