పెళ్లింట విషాదం, చిన్నారి మృతి | One child killed, 2 injured in celebratory firing in Bihar | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం, చిన్నారి మృతి

Apr 20 2016 10:27 AM | Updated on Sep 3 2017 10:21 PM

బిహార్ లో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అర్రా గ్రామంలోని పెళ్లి వేడుకల్లో జరిగిన ప్రమాదం ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది.


పట్నా: బిహార్  లో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది.  అర్రా గ్రామంలోని పెళ్లి వేడుకల్లో జరిగిన ప్రమాదం ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. వివాహ  ఊరేగింపులో  ఉపయోగించిన బాణా సంచా పేలుడులో  ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఒక చిన్నారి చనిపోగా, మరికొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు.   వీరిలోఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  దీంతో  స్థానికంగా ఆందోళన చెలరేగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు  చేసి విచారణ చేపట్టారు.   మరిన్ని  వివరాలు అందాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement