మోడీకి ఒబామా ఆహ్వానం | Obama invite to narendra modi | Sakshi
Sakshi News home page

మోడీకి ఒబామా ఆహ్వానం

May 18 2014 2:15 AM | Updated on Apr 4 2019 3:25 PM

మోడీకి ఒబామా ఆహ్వానం - Sakshi

మోడీకి ఒబామా ఆహ్వానం

భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించారు.

వాషింగ్టన్: భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించారు. ఫలితాలు వెలువడిన తర్వాత శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఆయన మోడీకి ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునేందుకు వీలు చూసుకుని అమెరికా రావాల్సిందిగా మోడీని ఒబామా ఆహ్వానించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. మోడీతో ఒబామా సంభాషించడం ఇదే మొదటిసారి. కాగా, అమెరికా పర్యటనకు వచ్చేటట్లయితే మోడీ, భారత ప్రభుత్వాధినేత హోదాలో ఏ-1 వీసా పొందేందుకు అర్హుడవుతారని అమెరికా విదేశాంగ ప్రతినిధి జెన్ సాకీ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement