లెక్క చూపని ఆదాయం రూ.71,941 కోట్లు! | Non-accountable income of Rs 71,941 crore | Sakshi
Sakshi News home page

లెక్క చూపని ఆదాయం రూ.71,941 కోట్లు!

Jul 24 2017 1:17 AM | Updated on Sep 27 2018 4:42 PM

లెక్క చూపని ఆదాయం రూ.71,941 కోట్లు! - Sakshi

లెక్క చూపని ఆదాయం రూ.71,941 కోట్లు!

గత మూడేళ్లలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ జరిపిన సోదాలు, స్వాధీనం, సర్వేల్లో రూ.71,941 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

► గత మూడేళ్లలో సోదాల్లో ఐటీ శాఖ కనుగొన్న మొత్తమిది
► సుప్రీంకోర్టుకు వివరాలు వెల్లడించిన కేంద్రం


న్యూఢిల్లీ: గత మూడేళ్లలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ జరిపిన సోదాలు, స్వాధీనం, సర్వేల్లో రూ.71,941 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నోట్ల రద్దు సమయమైన 2016 నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకు రూ.5,400 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బహిర్గ తమైనట్టు వెల్లడించింది.

అలాగే 303.367 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోర్టుకు సమ ర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు గల మూడేళ్ల కాలంలో (నోట్ల రద్దు సమయంతో కలిపి) పన్ను చెల్లించని ఆదా య వివరాలను కోర్టు ముందుంచింది.ఈ మూడేళ్ల కాలంలో  నిర్వహించిన సోదాల ద్వారా రూ.36,051 కోట్లు, 15 వేల సర్వేల ద్వారా రూ.33,000 కోట్లు లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్టు వెల్లడించింది. ఇదికాక రూ.2,890 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఆర్థిక శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement