మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు: మోదీ

Nobody Entered Into The Country Says PM Modi - Sakshi

న్యూఢిల్లీ: దేశ భూబాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామన్నారు. ఒక్క అడుగు కూడా మన భూబాగాన్ని వదులుకునేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. భారత భూభాగాన్ని కాపాడడమే తమ సర్వోన్నత లక్ష్యమని చెప్పారు. గతానికంటే భిన్నంగా సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని తెలిపారు. శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఆయన మాట్లాడారు.

భారత సైన్యం అత్యంత శక్తి సామర్థ్యాలతో ఉందని ప్రధాని తెలిపారు. ఒకే దిశలో ఒకేసారి కదిలే సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టం, ఫైటర్‌ జెట్లు, ఆధునిక హెలికాప్టర్లను బలగాలకు అందించామని ప్రధాని గుర్తు చేశారు. భారత సరిహద్దుల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయకూడదని అన్నారు. అదే సమయంలో దేశం మొత్తం సైనికులకు అండగా ఉంటుందని ప్రధాని వెల్లడించారు. అమర సైనికుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. చైనా చర్యలపై భారతీయులంతా ఆగ్రహంగా ఉన్నారని మోదీ తెలిపారు. భారత్‌ శాంతి, స్నేహాలను కోరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: అఖిలపక్ష భేటీలో వరుస ప్రశ్నలు సంధించిన సోనియా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top