'సంఘ్ రహిత భారత్'కు నితీశ్ పిలుపు | NITISH Nitish Kumar gives call for 'Sangh-mukt' Bharat | Sakshi
Sakshi News home page

'సంఘ్ రహిత భారత్'కు నితీశ్ పిలుపు

Apr 16 2016 8:38 PM | Updated on Sep 3 2017 10:04 PM

'సంఘ్ రహిత భారత్'కు నితీశ్ పిలుపు

'సంఘ్ రహిత భారత్'కు నితీశ్ పిలుపు

2019 సార్వత్రిక ఎన్నికలలోగా బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి కృషి జరగాలని జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ అన్నారు.

పట్నా: 'అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సమర్థులను ఉద్దేశపూర్వకంగా పక్కకుతప్పించి ఇప్పుడు బీజేపీని తమ చేతల్లోకి తీసుకున్న నేతలంతా సెక్యులరిజంపై విశ్వాసంలేనివాళ్లే. అనుకోని విధంగా అధికారం వారి చేతికే దక్కింది. దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే సంఘ్ శక్తుల నుంచి భారత్ ను కాపాడుకోవాలి. సెక్యూలర్ పార్టీలంతా ఏకమై 'సంఘ్ ముక్త్ భారత్'(సంఘ్ రహిత భారత్) కోసం కృషిచేయాలి' అని జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు.

2019 సార్వత్రిక ఎన్నికలలోగా లౌకిక పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి కృషి జరగాలని నితీశ్, ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక గూటికి చేరాలని పిలుపునిచ్చారు. వ్యక్తి గతంగా తాము ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతానికి  వ్యతిరేకం కానప్పటికీ సంఘ్ పరివార్ వేర్పాటువాద భావాలను తప్పకుండా నిరసిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement