కంగన మాటల్లో తప్పులేదు: నిర్భయ తల్లి

Nirbhaya Mother Said I Fully Agree With Kangana Ranaut - Sakshi

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. నిర్భయ దోషులకు క్షమించాలని కోరిన  న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై కంగనా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇందిరా జైసింగ్‌ను నాలుగు రోజులు దోషులతో బంధిస్తే ఆమెకు బాధ తెలిసి వస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆశాదేవి స్పందిస్తూ.. ‘‘నేను కంగనా మాటలను పూర్తిగా అంగీకరిస్తున్నాను.  అమె చెప్పింది నిజమే. ఇందిరా జైసింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, నాకు ఒకరు మద్దతుగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయాలన్న కంగన వ్యాఖ్యల్లో తప్పు లేదు. ఇలా చేస్తేనే భవిష్యత్తులో జరిగే నేరాలను అరికట్టవచ్చు’ అని అన్నారు. అలాగే తన కుమార్తెపై ఇంతటి దారుణం జరిగినప్పుడు  ఏమి జరిగిందో తనకు మాత్రమే తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2012 డిసెంబర్‌ 16 న కదులుతున్న బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో నలుగురికి ఫిబ్రవరి 1న మరణశిక్ష అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది.

(ఇందిర విజ్ఞప్తి: కంగనా ఘాటు వ్యాఖ్యలు) 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top