‘ఆమెను నిర్భయ దోషులతో కలిపి ఉంచాలి’ | Kangana Ranaut On Indira Jaising Forgive Nirbhaya Convicts Statement | Sakshi
Sakshi News home page

ఇందిర విజ్ఞప్తి: కంగనా ఘాటు వ్యాఖ్యలు

Jan 23 2020 10:48 AM | Updated on Jan 23 2020 12:34 PM

Kangana Ranaut On Indira Jaising Forgive Nirbhaya Convicts Statement - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలని కోరిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కంగనా విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా నిర్భయ తల్లికి ఇందిరా జైసింగ్‌ చేసిన అభ్యర్థన గురించి ప్రస్తావించగా... ‘‘అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి. కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వీళ్లకు దోషులు, హంతకులపైన ప్రేమ, దయ, జాలి పుట్టుకువస్తాయి. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు.. హంతకులకు జన్మనిస్తారు’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.(వారంలోపే ఉరి తీయాలి!)

కాగా ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన  నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తన భర్త, దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ దోషులను క్షమించినట్లుగానే.. నిర్భయ తల్లి కూడా నలుగురు దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్‌ ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన నిర్భయ తల్లి...  ఇందిరా లాంటి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆవరణలో ఆమెను చాలాసార్లు కలిసినా... తన క్షేమ సమాచారాలను అడగని మహిళ.. ఈరోజు దోషుల తరఫున మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కొక్కరిని ఉరి తీయండి.. అప్పుడే: నిర్భయ తల్లి

సోనియా అంత పెద్ద మాకు మనసు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement