
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కంగనానే నిర్మించారు. పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, సడెన్‌గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవంగా ఎమర్జెన్సీ మూవీని మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు కంగనా ప్రకటించింది. కానీ, అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ఎమర్జెన్సీ చిత్రం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటించిన సమయం కంటే మూడు రోజులు ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. కంగనా ఇందులో ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment