
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కలిశారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రికి అజయ్ దేవగణ్ హామీ ఇచ్చారు. ఏఐ సాంకేతికత జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సీఎంకు అందజేశారు.
మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. దీనికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రికి కపిల్‌దేవ్ వివరించారు.