నిర్భయ కేసు : ఆమె కడుపుకోత తీరేదెన్నడు..?

Nirbhaya Case BJP MP Gautam Gambhir Says Hang Convicts Now - Sakshi

ఉరి అమలు వాయిదాపై ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అసహనం

న్యూఢిల్లీ : ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అసహనం వ్యక్తం చేశారు. మన న్యాయవ్యవస్థకు ఇదొక మాయని మచ్చ వంటిదని పేర్కొన్నారు. నిర్భయ కీచకులు భూమ్మీద ఇంకా జీవించి ఉంటే అది మన న్యాయవ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. అంతటి పైశాచిక చర్యకు పాల్పడిన దోషులు ఏడేళ్లైన ఇంకా శిక్షను అనుభవించడం లేదని వాపోయారు. నిర్భయ తల్లి కడుపుకోత తీరేదెప్పుడని ప్రశ్నించారు. 

‘నిర్భయ దోషుల్ని వెంటనే ఉరితీయండి’అని గంభీర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, ముకేశ్‌ సింగ్‌, అక్షయ్‌ సింగ్‌, వినయ్‌ శర్మకు ఈరోజు (ఫిబ్రవరి 1) విధించాల్సిన ఉరిశిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని దోషుల విజ్ఞప్తి మేరకు.. ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా శుక్రవారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయొద్దని స్పష్టం చేశారు.
(చదవండి : నిర్భయ కేసు : వినయ్‌ శర్మ పిటిషన్‌ తిరస్కరణ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top