మాలెగావ్‌ కేసు : సాధ్వి ప్రాగ్య, పురోహిత్‌లపై అభియోగాలు

NIA Court Frames Charges Against Purohit, Sadhvi Pragya And Others - Sakshi

సాక్షి, ముంబై : 2008 మాలెగావ్‌ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రాగ్య, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌లపై ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. వీరిద్దరితో సహా ఏడుగురిపై కుట్ర, హత్యాయత్నం సహా పలు అభియోగాలు మోపింది. అయితే తామెలాంటి నేరానికి పాల్పడలేదని నిందితులు వాదించగా కేసు విచారణను నవంబర్‌ రెండుకు న్యాయస్ధానం వాయిదా వేసింది.

2008, సెప్టెంబర్‌ 29న మాలెగావ్‌లోని మసీదు సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయాలయ్యాయి. ఈ కేసులో పురోహిత్‌, ప్రగ్యా సింగ్‌లతో పాటు రిటైర్డ్‌ మేజర్‌ రమేష్‌ ఉపాధ్యాయ్‌, సమీర్‌ కులకర్ణి, అజయ్‌ రహిర్కార్‌, సుధాకర్‌ ద్వివేది, సుధాకర్‌ చతుర్వేదిలపై ఎన్‌ఐఏ ఇతర నిందితులుగా పేర్కొంది. కాగా ఈ కేసు నుంచి తమను తప్పించాలని కోరుతూ సాధ్వి ప్రగ్యా, పురోహిత్‌ సహా ఇతర నిందితుల వినతిని గత ఏడాది డిసెంబర్‌ 27న ఎన్‌ఐఏ న్యాయస్ధానం తోసిపుచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top