నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్‌: సాధ్వీ

Nehru Was The Biggest Rapist Sadhvi Prachi - Sakshi

భోపాల్‌: దేశతొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందరికంటే నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై సాధ్వీ ఈ విధంగా స్పందించారు. ‘భారత్‌ తొలినాళ్లలో మంచి దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశం రాముడు, కృష్ణుడు పుట్టిన దేశం. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాతనే అత్యాచార సంస్కృతిని తీసుకువచ్చారు. దానికి ప్రధాన కారణం తొలి ప్రధాని నెహ్రూనే. ఎందుకంటే ఆయనే పెద్ద రేపిస్ట్‌. టెరరిజం, నక్సలిజం, రేపిజం అన్నీ నెహ్రూ కుంటుంబం నుంచి వచ్చినవే. కాంగ్రెస్‌ నాయకులే దేశాన్ని సర్వనాశనం చేశారు’ అంటూ వివాదాస్పద రీతిలో మాట్లాడారు.

కాగా ఉన్నావ్‌ ఘటనపై రాహుల్‌ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని అయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top